క్రైమ్/లీగల్

సబార్డినేట్ జ్యుడీషియరీ సభ్యులు జిల్లా జడ్జి పోస్టుకు అనర్హులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సబార్డినేట్ జ్యుడిషీయరీ సర్వీసెస్ సభ్యుడు ప్రత్యక్ష నియామకం ద్వారా జిల్లా న్యాయమూర్తులుగా నియమించడానికి అర్హత లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దిగువ న్యాయ వ్యవస్థ సభ్యులు ప్రత్యక్ష నియామకం ద్వారా జిల్లా న్యాయమూర్తుల పదవులకు అర్హులు కాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ మేరకు స్పష్టం చేసింది. జిల్లా న్యాయమూర్తుల పదవులను కేవలం న్యాయవాదుల కోసమే పరిమితం చేసినట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు. న్యాయవాదులు బార్ కౌన్సిల్‌లో సభ్యుడై ఏడేళ్ళకు తగ్గకుండా అనుభవం కలిగి ఉండాలన్న నియమం ఉంది. రాజ్యాంగంలోని అధికరణ 233 ఉప నిబంధన 2ను వివరించేప్పుడు ధర్మాసనం, న్యాయ సేవలో ఉన్న అభ్యర్థులను జిల్లా న్యాయమూర్తుల ప్రత్యక్ష నియామకం కోసం పరిగణించాలని పేర్కొన్నారు. అధికరణ 233 ఉప నిబంధనల 2 ప్రకారం ఇప్పటికే యూనియన్ లేదా రాష్ట్ర సేవలో ఉన్న వ్యక్తి జిల్లా న్యాయమూర్తిగా నియమించేందుకు అర్హులు కారని తెలిపారు. జిల్లా న్యాయమూర్తి పదవికి అర్హత సాధించాల్సిన అభ్యర్థి న్యాయవాదిగా అనుభవం ఏడు సంవత్సరాలకు పైగా ఉండాలన్న నిబంధనను సిఫార్సు చేయడం జరిగిందని ఆయన వివరించారు. పైగా నియామకం కోసం హైకోర్టు సిఫార్సు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సబార్డినేట్ జ్యుడిషీయరీ సభ్యులను పదోన్నతి ద్వారా జిల్లా న్యాయమూర్తి పదవికి పరిగణించవచ్చని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.