క్రైమ్/లీగల్

రెండోరోజూ ఏసీబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 19: రాష్ట్రంలో మున్సిపల్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు రెండోరోజూ కొనసాగాయి. ప్రధానంగా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన ఏసిబి బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నిర్మితమైన, నిర్మాణంలో ఉన్న పలు భవనాలు, ఇళ్ళు, మాల్స్‌ను తనిఖీ చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో లెక్కలేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిగ్గు తేల్చిన అధికారులు రెండోరోజు ఆకస్మిక తనిఖీల్లో పలు నిర్మాణాలకు అనుమతులు లేవని నిర్ధారించుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే ఈ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాలకు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తేలింది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ పి సీతారామాంజనేయులు ఆదేశాలతో రాష్ట్రంలోని 14 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సుమారు 100 మందికి పైగా ఏసిబి బృందాలు తొలిరోజు మంగళవారం రాష్టవ్య్రాప్తంగా దాడులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ దాడుల్లో సుమారు 3లక్షల రూపాయలు అనధికారిక నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అన్ని చోట్ల టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో అక్రమ కార్యకలాపాలు అక్కడి అధికారులు, సిబ్బంది కొనసాగిస్తున్నట్లు నిగ్గు తేల్చారు. ఇదే క్రమంలో రెండో రోజు బుధవారం కూడా ఈ దాడులు కొనసాగించారు. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ ఉదాసీనత ఆసరాగా రామకృష్ణానగర్, కత్తెర వీధి, మంగువారితోట, చాణక్యనగర్ తదితర చోట్ల ప్లాన్ లేకుండా భారీ అక్రమ నిర్మాణాలను గుర్తించారు. విజయనగరం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రింగ్‌రోడ్డులో ఎండోమెంట్‌కు చెందిన 1355.75చదరపు మీటర్ల స్ధలంలో అక్రమంగా నిర్మించిన లీ పారడైజ్ ఫంక్షన్ హాలును గుర్తించారు.
అయినా టౌన్ ప్లానింగ్ నుంచి ఏవిధమైన చర్యలు లేనట్లుగా ఏసిబి నిర్ధారించింది. విశాఖ పట్నం జోన్-1 పరిధిలోని ఇందిరానగర్‌లో భారీ అక్రమ నిర్మాణాలు, నిబంధనల మేరకు సెట్‌బ్యాక్ లేకపోవడం, అదేవిధంగా ఓ ఇండివిడ్యువల్ హౌస్‌కు అనుమతులు లేకపోవడం దీని వెనుక టౌన్ ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం, వైఫల్యాలను గుర్తించారు. అదేవిధంగా గాజువాక జోన్‌లో మూడంతస్తుల భవనానికి అసలు ఏవిధమైన అనుమతులు లేకపోవడం, అక్కడే మరోచోట ఓ భారీ భవనం కూడా అక్రమంగా నిర్మించినట్లు తేలింది. మధురవాడలో కూడా ప్లాన్ మంజూరు కాకుండానే జరిపిన బహుళ అంతస్తుల నిర్మాణాలను ఏసిబి గుర్తించింది. తూర్పుగోదావరి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం నాలుగు చోట్ల భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు అక్రమంగా నిర్మించడాన్ని గుర్తించిన ఏసిబి ఆయా చోట్ల తనిఖీలు జరిపి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మున్సిపల్ కార్యాలయం పరిదిలోని ఎఫ్‌సిఐ కాలనీ, ఏలూరు రోడ్డు, పలుచోట్ల అక్రమ నిర్మాణాలు, సెట్‌బ్యాక్‌లు లేకపోవడం, బిల్డింగ్ ప్లాన్ లేకుండా జరిగిన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు లేకపోవడం, ఇందుకుగాను టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వైఫల్యాలను ఏసిబి అధికారులు కనుగొన్నారు. కృష్ణాజిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేదారేశ్వరరావు పేటలో జిప్లస్‌వన్ కమర్షియల్ కం రెసిడెన్షియల్ భవనానికి ప్లాన్ మంజూరు లేకపోవడం గుర్తించారు. అదేవిధంగా విజయవాడలోనే వన్‌టౌన్‌లో ఆరు చోట్ల, అదేవిధంగా మహానాడు రోడ్డు అక్రమ భవన నిర్మాణాల నిగ్గు తేల్చారు. గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నల్లజెరువు, నగరంపాలెం, శివరాంనగర్, లక్ష్మీపురం తదితర చోట్ల సుమారు పదికి పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఇవన్నీ కూడా ప్లాన్ లేకుండా నిర్మితమైనట్లు వెల్లడైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భాగ్యనగర్‌లో జి ప్లస్ త్రి భవనం అక్రమంగా నిర్మించినట్లు ఏసిబి గుర్తించింది. నెల్లూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాంనగర్‌లో అక్రమ నిర్మాణం, చిత్తూరు జిల్లా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగుచోట్ల, కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైదుకూరులో నాలుగు చోట్ల, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం పరిధిలో మూడు చోట్ల, అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలో సుమారు పదికి పైగా అక్రమ నిర్మాణాలను తనిఖీ చేసిన అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగం సహకారంతో ప్లాన్ లేకుండా, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపినట్లు నిగ్గు తేల్చారు. రాష్టవ్య్రాప్తంగా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంత భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా.. భవన యజమానులపై టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకోవడం గాని, కనీసం అటువైపు కనె్నత్తి చూడకపోవడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలకు సైతం ఉపక్రమించలేదని ఈ తనిఖీల్లో ఏసిబి అధికారులు గుర్తించారు. ఈరెండురోజుల దాడులకు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందచేయనున్నట్లు ఏసిబి డీజీ తెలిపారు.