క్రైమ్/లీగల్

బస్సును ఢీకొన్న లారీ : 20మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 20: తమిళనాడులో గురువారం తెల్లవారుఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20మంది దుర్మరణం చెందారు. మరో 28మందికి గాయాలయ్యాయి. ప్రయాణికుల బస్సును ఓ లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. తిరుకూరులోని సేలం-కొచ్చి హైవేలో తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందనీ.. బెంగుళూరు నుంచి ఎర్నాకులం వెళ్తున్న కేరళ రోడ్డు రవాణా సంస్థ బస్సు ఈ ప్రమాదానికి లోనైనట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న లారీ ఈ బస్సును ఢీకొన్న సమయంలో అందులోని ప్రయాణికులంతా నిద్రపోతున్నారని వెల్లడించారు. పూర్తిగా టైల్స్‌తో నిండిన ఈ లారీ టైర్ ఒకటి పేలిపోయిందని.. దాని ఫలితంగా అది అదుపుతప్పి బస్సును ఢీకొందని వివరించారు. ఆరుగురు మహిళలు సహా 20 మంది అక్కడికక్కడే మరణించారని, గాయపడ్డవారిని తిరుకూరు, కోయంబత్తూరు ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. లారీ అత్యంత వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని.. పైగా టైరు పేలిపోవడంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొందని పలక్కాడ్ శివవిక్రం తెలిపారు. ఇటీవలి కాలంలో ఇంత ఘోర రోడ్డు ప్రమాదం ఎప్పుడూ జరక్కపోవడంతో ఈ ఘటన తమిళనాడు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద సమయంలో బస్సులో 48మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా కేరళకు చెందినవారేనని.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళని స్వామి, కేరళ సీఎం పినరయి విజయన్‌లు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేయడంతో పాటు క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నానని మోదీని ఉటంకిస్తూ పీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది. మృతదేహాలను కేరళకు తరలించడంతో పాటు ఇతరత్రా అవసరమైన సహాయ చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి తెలిపారు. గాయపడ్డ వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు ఆయన తెలిపారు. సహాయ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రులు ఏకే శశిధరన్, వీఎస్ సునీల్‌కుమార్‌లను తిరుకూర్ పంపినట్లు కేరళ సీఎం విజయన్ వెల్లడించారు.
*చిత్రం... ప్రమాద తీవ్రతకు పూర్తిగా నుజ్జునుజ్జయన కేరళ ఆర్టీసీ బస్సు