క్రైమ్/లీగల్

టెన్త్ విద్యార్థి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె: పాఠశాలలో జరిగిన విద్యార్థుల మధ్య ఘర్షణ ఓ విద్యార్థి హత్యకు దారితీసిన సంఘటన గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చోటుచేసుకుంది. మదనపల్లె రెండవ పట్టణ సీఐ తమీమ్‌అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ తొట్లివారిపల్లెకాలనీకి చెందిన వెంకటరమణ, రెడ్డిశాంతమ్మలకు కుమారుడు, కూతురు ఉన్నారు. ఏడేళ్ల కిందట వెంకటరమణ, రెడ్డిశాంతమ్మ రోడ్డుప్రమాదంలో మరణించారు. కూతురు వివాహం జరుగగా, కుమారుడు అశోక్‌కుమార్(14)
మదనపల్లెలో మేనత్త వద్ద ఉంటూ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. అశోక్‌కుమార్ చదివే సెక్షన్‌లోనే పట్టణ శివారుప్రాంతం చంద్రకాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సుబ్రమణ్యం, శాంతమ్మ కుమారుడు సతీష్ కూడా చదువుకుంటున్నాడు. మూడురోజుల కిందట సతీష్ చెప్పులను బ్లేడుతో ఎవరో కోయటంపై తరగతి గదిలో గొడవ జరిగింది. గురువారం మధ్యాహ్నం భోజన సమయంలో అశోక్‌కుమార్, సతీష్ అతని స్నేహితుల మధ్య గొడవ జరిగింది. మధ్యాహ్నం ఇంటర్‌వెల్ సమయంలో పాఠశాల క్రీడామైదానంలో సతీష్‌తోపాటు బయటనుంచి వచ్చిన మరో ఇద్దరు అశోక్‌కుమార్‌ను తీవ్రంగా చితకబాదారు. అశోక్‌కుమార్ ముక్కుపై, ఛాతిపై బలమైన గాయాలు తగలటంతో అశోక్‌కుమార్ మైదానంలోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇది గమనించిన సహచర విద్యార్థులు అతనికి నీరు తాగించినా స్పృహ రాకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అశోక్‌కుమార్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. సమాచారం అందుకున్న మేనత్త కుమారి ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించింది. అశోక్‌కుమార్‌పై గత మూడురోజులుగా సతీష్ అనే విద్యార్థి గొడవపడుతూ కొడుతున్నాడని పలుమార్లు చెప్పినట్లు మేనత్త కుమారి తెలిపింది. సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు
పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ ప్రాణం పోయింది
పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బయట నుంచి ఇద్దరు వ్యక్తులతో కలసి సతీష్ దాడికి పాల్పడి హత్యచేశాడని మేనత్త ఆరోపించింది. పాఠశాలలో విద్యార్థులను పట్టించుకోవడం లేదని, పలుమార్లు తన మేనల్లుడు అశోక్‌కుమార్ విషయమై ఉఫాధ్యాయులను ఆరా తీసినా స్పందించలేదన్నారు. అశోక్‌కుమార్‌ను హత్యచేసిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎం, పీఈటీలను వెంటనే విధుల నుంచి తొలగించాలని మేనత్త కుమారి డిమాండ్ చేసింది.