క్రైమ్/లీగల్

ఆర్మీ ఉద్యోగి ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: ప్రేమ పేరుతో వంచించిన తనపై ఓ యువతి కేసు పెట్టి జైలుకు పంపడంతో అక్కసు పెంచుకున్న ఒక సైనిక ఉద్యోగి తుపాకీతో కాల్పులకు తెగబడిన సంఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన యువతి, ఇదే మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన యువకుడు ఏమినేని బాలాజీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో బాలాజీ ఆర్మీ ఉద్యోగిగా ఎన్నికై ఉద్యోగంలో చేరాడు. ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చిన బాలాజీని తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ఒత్తిడి తీసుకురావడంతో అతడు నిరాకరించాడు. దీంతో ఆ యువతి గత ఏడాది డిసెంబర్‌లో బాపట్ల పోలీసులను ఆశ్రయించింది. స్పందించిన పోలీసులు బాలాజీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన బాలాజీ తనను జైలుకు పంపిన యువతిపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆ యువతి ఇంటికి ఆటో వేసుకొని వెళ్ళాడు. అప్పటికే నిద్రిస్తున్న వారిని దుర్భాషలాడుతూ కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన యువతి తల్లి కుమార్తెను కాల్పుల నుండి తప్పించబోగా ఆమె చెవికి రాసుకుంటూ తుపాకీ గుండు దూసుకుపోవడంతో రక్తస్రావమై కేకలు వేసింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన గ్రామస్థులు అక్కడికి చేరుకోగా, తుపాకీని అక్కడే వదిలేసి బాలాజీ పరారయ్యాడు. అయితే అక్కడే ఉన్న ఆటోడ్రైవర్‌ను గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాయపడిన తల్లిని చెరుకుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుండి మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరులోని జిల్లా సర్వజన సమగ్ర ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చెరుకుపల్లి ఎస్‌ఐ రమేష్, రేపల్లె రూరల్ సీఐ శ్రీనివాసరావు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని ప్రాథమిక విచారణ అనంతరం తల్లీకూతుళ్లను పరామర్శించి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లీ, కుమార్తెలు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
*చిత్రం... నిందితుడు ఉపయోగించిన తుపాకీ