క్రైమ్/లీగల్

దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, ఫిబ్రవరి 22: పలు ప్రదేశాలలో దొంగ తనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు సిసిఎస్ డీఎస్‌పి మురళీ కృష్ణ తెలిపారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంచికచర్ల ఎన్‌టిఆర్ కాలేజీ రోడ్డులో గత ఏడాది జూలై నెలలో చెల్లు ప్రదీప్ ఇంట్లో చోరీ జరిగిందనీ, నల్ల పుసల గొలుసు, పదివేల నగదు అపహరించారని తెలిపారు. ఈ కేసులో బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తును చేపట్టిన పోలీసులు సిసి పుటేజీ ఆధారంగా పిల్లి వెంకటేశ్వరరావు, పల్లంటి బాబు, కొల్లోకు శ్రీరామ్‌లను కంచికచర్ల బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు మూడు కేజీల వెండి, పది వేల నగదు, రెండు చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయి పిల్లి వెంకటేశ్వరరావు, కుమారు పిల్లి కోటేశ్వరరావులు కలసి పాలకొల్లు, హనుమాన్ జంక్షన్, కైకలూరు, విసన్నపేట, ధర్మాజీగూడెం, చాట్రాయి, సత్తుపల్లి, కల్లూరు, నర్సాపురం టౌన్ నేరులు చేసి దొంగతనం చేసిన బంగారపు వస్తువులను సత్తుపల్లి ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ నందు తాకట్టు పెట్టి మిగిలిన బంగారం ఖమ్మం పట్టణంలోని అట్టిక గోల్డ్ కంపెనీ నందు సుమారు 250 గ్రాముల బంగారు ఆభరణాలు అమ్మి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. వీరు మొత్తం 11 కేసులలో ముద్దాయిలుగా ఉండగా అమ్మిన బంగారంతో పాటు తాకట్టు పెట్టిన బంగారాన్ని రికవరీ చేయవలసి ఉందని నేర విభాగ డీఎస్‌పి మురళీకృష్ణ తెలిపారు.