క్రైమ్/లీగల్

అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలకు-తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఇద్దరు కూడా లష్కర్-ఏ-తోయిబాకు చెందిన తీవ్రవాదులుగా గుర్తించారు. మరణించిన వారిలో కుల్గంలోని కైమోహ ప్రాంతానికి చెందిన నవీద్ అహ్మద్‌గా, కైమోహలోని వాన్‌పొరాకు అఖిబ్ యాసిన్ భట్‌గా గుర్తించామని జమ్మూ-కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని బిల్‌బెహరలోని సంగం ప్రాంతంలో తీవ్రవాదులు తలదాచుకుని ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని ఆయన చెప్పారు. దీంతో పోలీసులపైకి తీవ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించడంతో, భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపడంతో ఇద్దరు తీవ్రవాదుల హతమయ్యారని ఆయన వివరించారు. అనేక తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన నవీద్ అహ్మద్ భట్ 2018 సంవత్సరంలో లష్కర్-ఏ-తోయిబా తీవ్రవాద సంస్థలో చేరినట్లు డీజీపి సింగ్ తెలిపారు. అహ్మద్ భట్‌పై లోగడ ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆయన చెప్పారు. అమాయక ప్రజలపై కాల్పులు జరపడం, పోలీసు భద్రతా బలగాల క్యాంపులపై బాంబులు విసిరిన నేరం వంటి పలు అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. మరో తీవ్రవాది అఖిబ్ యాసిన్ భట్ గత ఏడాది లష్కర్-ఏ-తోయిబాలో చేరి పలు విధ్వంసక చర్యలకు పాల్పడినట్లు డీజీపి దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఇదిలాఉండగా ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో హిజ్బుల్ ముజాహీదిన్ కమాండర్‌గా చెప్పుకుంటున్న జునైద్ ఫారూఖ్ పండిట్ అరెస్టు చేసినట్లు డీజీపి చెప్పారు. అరెస్టు చేసిన తీవ్రవాది నుంచి పిస్టల్, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.