క్రైమ్/లీగల్

దోషి చెబుతున్నవన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మకు పటియాల కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. తనకు మతిస్థితిమిత లేదంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా డిస్మిస్ చేశారు. వినయ్ పిటిషన్‌పై శనివారం వాదోపవాదాలు జరిగాయి. ‘దోషి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. శిక్షను వాయిదా వేయించుకోవడం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నాడు’అని తీహార్ జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. దోషుల ఆరోగ్య పరిస్థితి భేషుగ్గా ఉందని ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు వెల్లడించారు. తీహార్ జైలు అధికారులు దోషికి సంబంధించి కోర్టుకు అందజేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను న్యాయమూర్తి పరిశీలించారు. ‘దోషి చెబుతున్నవన్నీ అబద్ధాలే. అతడు గోడకు తలను బాదుకుంటే గాయపడడం మాత్రం నిజం. అయితే ఎలాంటి ఫ్యాక్టర్ కాలేదు. వైద్యుని చూపించి చికిత్స చేయించాం. అంతే తప్ప పెద్ద ప్రమాదమేదీ లేదు. అన్నీ అవాస్తవాలే చెబుతున్నాడు’అని తీహార్ జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అతడికి ఎలాంటి మానసిక అనారోగ్యం లేదని వైద్యులు ధృవీకరించారన్న అధికారులు ‘నలుగురు దోషులకు రోజూ వైద్యులు పరీక్షలు జరుపుతున్నారు. ఎక్కడా ఎలాంటి అనారోగ్యం లేదు’అని న్యాయమూర్తికి చెప్పారు. దోషి వినయ్‌శర్మ నదుటపై ప్లాస్టర్ అంటించుకుని ఏదో జరిగిపోయినట్టు చెబుతున్నాడని, వాస్తవానికి అతడికి ఎలాంటి ఫ్యాక్చర్ కాలేదని జైలు అధికారుల తరఫున్యాయవాది వెల్లడించారు. అయితే దోషి తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తూ గాయాలకు సంబంధించి అధికారులు సరైన డాక్యుమెంట్లు కోర్టుకు అందజేయలేదని ఆరోపించారు.
తలపై గాయమైనందున తల్లిని కూడా గుర్తించలేకపోతున్నాడన్న సింగ్ వాదనను జైలు అధికారులు తోసిపుచ్చారు. ఉభయుల వాదనలు విన్న కోర్టు వినయ్ శర్మ పిటిషన్‌ను కొట్టివేసింది.