క్రైమ్/లీగల్

రేపిస్టు హోంగార్డ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 22: పదిహేనేళ్ల బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకోవటంతో పాటు ఆ బాలిక గర్భం దాల్చడానికి కారకుడైన ఓ హోంగార్డు కటకటాలపాలైన ఉదంతమిది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం డీఎస్పీ వద్ద, ప్రస్తుతం మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వద్ద పోలీసు వాహనం డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఫణీంద్ర తాను నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికకు ప్రేమ, పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత ఆ బాలికతో శారీరక సంబంధం ఏర్పర్చుకుని, పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్న ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఆమె గర్భవతి అనే విషయం బయటపడింది. ఏం జరిగిందని ఆ బాలికను నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఫణీంద్ర తన పట్ల వ్యవహరించిన తీరును ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు హోంగార్డ్ ఫణీంద్రపై క్రైం నెంబర్ 49/2020 అండర్ సెక్షన్ 376 ఐపీసీ, పోక్సో కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు చిలకలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ శనివారం తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపారని తెలిపారు.