క్రైమ్/లీగల్

భర్తపై కోపంతో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట: భర్తపై కోపంతో మనస్ధాపం చెందిన భార్య వారి ఇద్దరు కుమారులను హతమార్చి తాను బలవర్మవరణానికి పాల్పడిన సంఘటన కోట మండలంలోని ఊనుగుంటపాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కోట మండలంలోని ఊనుగుంట పాలెం గ్రామంలో కల గిరిజన కాలనీకి చెందిన నాగార్జున భార్య వాణి కుటుంబ కలహాల వలన ఇద్దరి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి నాగార్జున తన విధి నిర్వహణలో భాగంగా నెల్లూరుకు వెళుతుండగా తమను కూడ తీసుకువెళ్ళి నెల్లూరులో కాపురం పెడదామని వత్తిడి చేసింది. పరిస్ధితులు బాగలేని కారణంగా త్వరలోనే అద్దె ఇల్లు తీసుకుని నెల్లూరులో కాపురం పెట్టడానికి ఏర్పాటుచేస్తానని భర్త చెప్పాడు. దీంతో మనస్తాపంతో శుక్రవారం రాత్రి ఇద్దరు కుమారులు ప్రదీప్(5),సుధీర్(2)లను హతమార్చింది. అనంతరం ఆమె ఇంటిలో ఉన్న దులానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమీపంలో ఉన్నవాళ్ళు ఉదయం ఇంటి నుండి ఎవరూ వెలుపలికి రాకపోవడంతో వెళ్ళి పరిశీలించగా మృతి చెందిన విషయాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్ధలానికి సిఐ నరసింహారావు, హెడ్ కానిస్టేబుల్ సాయినాధ్ ఇంటి తలుపులు పగులకోట్టి లోపలికి ప్రవేశించి మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం నందలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న భర్త నాగార్జున ఇంటికి వచ్చి మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించడంతో గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.
*చిత్రం... మంచంపై తల్లీ, బిడ్డల మృతదేహాలు