క్రైమ్/లీగల్

ఇద్దరిపై కాల్పులు జరిపిన ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: ప్రేమ పేరుతో వంచించిన తనపై ఓ యువతి కేసుపెట్టి జైలుకు పంపిందన్న కక్షతో ఆమెతో పాటు ఆమె తల్లిపై తుపాకీతో కాల్పులు జరిపిన ఆర్మీ ఉద్యోగి బాలాజీ (24) అదేరోజు తాడేపల్లి మండలం కొలనుకొండ - పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది. తెనాలి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 24సంవత్సరాల వయస్సు కలిగిన యువకుడు పెదవడ్లపూడి - కొలనుకొండ రైల్వేస్టేషన్ల మధ్య రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటాద్రి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మూడు ముక్కలైన యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని యువకుడి మృతదేహంగా పోస్టుమార్టం కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం జీఆర్పీ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం మృతుడు చెరుకుపల్లి మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి ఏమినేని బాలాజీ అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ఇదే మండలం నడింపల్లి గ్రామంలో తల్లీ కూతుళ్లపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో నిందితుడిగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకుని తల్లిదండ్రులకు, చెరుకుపల్లి, బాపట్ల పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు, చెరుకుపల్లి ఎస్‌ఐ రమేష్ తెనాలి జిల్లా వైద్యశాలలోని శవాగారంలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి బాలాజీనే అని గుర్తించారు. యువతి గతంలో ఫిర్యాదు చేసి ఉండటంతో బాపట్ల, చెరుకుపల్లి పోలీసులు కూడా తెనాలి వచ్చి మృతుడిని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.