క్రైమ్/లీగల్

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఫిబ్రవరి 23: పూర్తిగా మైనారిటీ తీరని ప్రేమజంట భువనగిరి ఖిల్లాపై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరు గ్రామానికి చెందిన కోడూరి నవీన్ (19) అదే మండలంలోని వేచరేని గ్రామానికి చెందిన స్వాతి (17) ఒకరిని ఒకరు ప్రేమించుకుని వివాహం చేసుకునేందుకు 22న శనివారం ఇంటినుంచి పారిపోయారు. తమ విహాహానికి ఇరువురి తల్లితండ్రులు అనుమతించరన్న అనుమానంతో ఆదివారం భువనగిరి ఖిల్లాపైకి చేరుకుని నెయిల్‌పాలిష్‌లో కలిపే ద్రావణాన్ని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈవిషయాన్ని భువనగిరిలో నివసముంటున్న తన స్నేహితునికి నవీన్ ఫోన్ చేసి సమాచారం తెలిపాడు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు భువనగిరి ఖిల్లాపైకి చేరుకుని ప్రేమజంటను వైద్యచికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చేర్చి ప్రాథమిక వైద్యచికిత్సలు అందజేశారు. వారిరువురిని అత్యవసర వైద్యచికిత్సల నిమిత్తం సికింద్రాబాద్ గాంధి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు భువనగిరి పట్టణ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
*చిత్రం... ఆసుపత్రిలో ప్రేమజంట