క్రైమ్/లీగల్

బాలికపై ఇద్దరు బాలుర అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిహత్నూర్, ఫిబ్రవరి 23: ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని వడ్డెర కాలనీకి చెందిన 14 ఏళ్ళ బాలిక బహిర్భూమికని శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుండి ఊరి బయటకు వెళ్ళగా కాపుకాసి ఉన్న ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన జిల్లాలో అలజడి రేపింది. ఇచ్చోడ సీఐ శ్రీనివాస్, గుడిహత్నూర్ ఎస్సై కొక్కుల రోహిణి తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని వడ్డెరకాలనీకి చెందిన ఓ బాలిక బహిర్బూమికై వెళ్ళగా అక్కడే దారి వద్ద కాపుకాస్తున్న ఇద్దరు బాలురు ఆమెను వెంబడించి పక్కనే ఉన్న పొలంలోకి తీసుకవెళ్ళి అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాలిక తనకు జరిగిన ఆఘాయిత్యాన్ని ఏడుస్తూ కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వెంటనే స్థానిక ఎస్సై రోహిణి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్టు తెలిపారు.