క్రైమ్/లీగల్

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 23: అతి వేగంతో దూసుకువచ్చిన కారు బంజారాహిల్స్ ప్రధాన రహదారిపై బీభత్సం సృష్టించింది. మాదాపూర్ వైపు నుంచి కేబీఆర్ పార్కు మీదుగా పంజాగుట్ట వైపునకు వస్తున్న కారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ప్రమాదానికి గురి అయింది. పరిమితికి మించిన వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుకు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకువెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున సంఘటన చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా కారులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన అనంతరం అందులో ప్రయాణించిన వారు కారును అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు. తోటి వాహనదారులు, స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ప్రాథమిక విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నెంబర్ ఆధారంగా కారులో ప్రయాణించింది ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకొని ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.