క్రైమ్/లీగల్

పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తూ వ్యక్తి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల, ఫిబ్రవరి 23: మండల పరిదిలోని ఐనపూరు కృష్ణానదిలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ వ్యక్తి నదిలో గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన ఈడే మంగారావు (70) ఆదివారం అమావాస్య కావడంతో పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు నది దగ్గరకు వెళ్లి పిండ ప్రదాన తంతు పూర్తయిన పిదప పిండాలను నదిలో కలిపే సందర్భంలో ప్రమాద వశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పమిడిముక్కల ఎస్‌ఐ సత్యనారాయణ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాలింపు చర్యలు చేపట్టి వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.