క్రైమ్/లీగల్

సంగమంలో తప్పిన పెనుప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, ఫిబ్రవరి 23: సాగరసంగమం హంసలదీవి బీచ్ విశిష్టతను తెలుసుకుని ఈ ఆదివారం హంసలదీవి బీచ్‌కి వెళదామని బయలుదేరిన వారు సాగరసంగమ ప్రదేశంలో స్నానం చేస్తూ ప్రమాదం బారినపడి స్థానిక మత్స్యకారులచే రక్షించబడి సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసు, మెరైన్ సిబ్బంది అప్రమత్తపై పాలకాయతిప్పకు చెందిన మత్స్యకారుడు మోకా ఏడుకొండలు నీటిలో మునిగిపోతున్న బాలుడు, తల్లిని ఒడ్డుకు తీసుకువచ్చారు. తరువాత వివరాలు సేకరించగా గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని అంగలకుదురు నుంచి నలుగురు కుటుంబ సభ్యులు ఆటోలో హంసలదీవి బీచ్‌కు చేరుకున్నారు. కళ్ల ఎదుటే స్నానం చేస్తున్న కొడాలి జీవితేష్(12) నీటి లోతుకు వెళ్లి కొట్టుకుపోతుండగా గమనించిన తల్లి కొడాలి రాధిక (38) కుమారుడిని కాపాడేందుకు తాను కూడా నీటిలోకి వెళ్లింది వారిరువురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటంతో సమీపంలో ఉన్న మత్స్యకారుడు గమనించి వారిని పట్టుకుని చాలా కష్టంతో ఒడ్డుకు తీసుకువచ్చాడు. సమీపంలో బీచ్ ఒడ్డునే ఉన్న మెరైన్ సిబ్బంది, రామకృష్ణరాజు మిగిలిన వారిని కూడా అప్రమత్తం చేసి ప్రమాదం బారి నుండి కాపాడారు. ఒడ్డుకు వచ్చిన తరువాత తల్లి కుమారుడిని హత్తుకుని రోధించిన తీరు చూపరులను కలచివేసింది. వచ్చిన నలుగురు సభ్యులు పోలీసులు, మత్స్యకారుడికి కృతజ్ఞలు తెలిపి వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట ఆత్మహత్య చేసుకుందామని వచ్చిన మహిళను కాపాడిన మాజీ సర్పంచ్, మత్స్యకారుడు కొక్కిలిగడ్డ సముద్రాలు, తల్లికొడుకులను కాపాడిన మోకా ఏడుకొండలకు ప్రభుత్వం నుంచి పురస్కారం అందించేందుకు మెరైన్ పోలీసు విభాగం తరపున సిఫార్సు చేస్తామని సీఐ పవన్ కిషోర్, ఎస్‌ఐలు జిలాని, సన్యాసి నాయుడు తెలిపారు.