క్రైమ్/లీగల్

ఆత్కూరులో భారీగా గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఫిబ్రవరి 23: గన్నవరం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆత్కూరు గ్రామం వద్ద అక్రమంగా కారులో రవాణా చేస్తున్న 450 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాసరావుగన్నవరం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో పట్టుబడిన గంజాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయిని ఆత్కూరు గ్రామం వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. చెన్నైకు చెందిన ముత్తు లింగం గంజాయి పాత నేరస్థుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కోర్టు వాయిదాకు హాజరై తిరిగి వస్తు గంజాయిని అక్రమ రవాణా చేస్తు పోలీసులకు పట్టుబడినట్లు శ్రీనివాసరావు వివరించారు. కారులో ముత్తు లింగంకు చెందిన ఆధార్‌కార్డు, పాత కేసుల వివరాలు, లాయర్ల ఫోన్ నంబర్లు గుర్తించడంతో ముత్తులింగమే ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 450 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

*