క్రైమ్/లీగల్

రూ. కోటి విలువైన గుట్కా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు: చిత్తూరు జిల్లా సత్యవేడులో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కోటి రూపాయల గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో శ్రీకాళహస్తి రోడ్డులో సీఐ బీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున సత్యవేడులోని గోడౌన్‌కు కోటి రూపాయలు విలువచేసే గుట్కాను అక్రమంగా తరలిస్తుండగా గుర్తించారు. ముందుగా సమాచారం అందడంతో పక్కా ప్రణాళికతో దాడులు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశారు.