క్రైమ్/లీగల్

ఏబీవీ పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఎఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)లో సోమవారం నాడు విచారణ కొనసాగింది. ఏబీ వెంకటేశ్వరరావు తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. క్యాట్ తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇస్తూ ఏబీ వెంకటేశ్వరరావు అఫిడవిట్ దాఖలు చేశారు. కనీస విచారణ లేకుండా తనను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. అఖిల భారత నిబంధనలకు విరుద్ధంగా తనను సస్పెండ్ చేశారని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ డీజీగా పనిచేసిన సమయంలో భద్రతాపరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఏబీ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గత ఏడాది మే నుండి తనకు కనీసం వేతనం చెల్లించడం లేదని , బదిలీ చేసి వేకెన్సీ రిజర్వులో ఉంచి పోస్టింగ్ ఇవ్వకుండానే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలనే ఏబీ వెంకటేశ్వరరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.