క్రైమ్/లీగల్

కేంద్రం పిటిషన్‌పై విచారణ మార్చి 5కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులోని ముద్దాయిలకు ఉరిశిక్షను అమలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి అయిదో తేదీన విచారించనున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. నిర్భయ కేసులో మరణ శిక్ష ఖరారయిన నలుగురు ముద్దాయిలను ఒకేసారి ఉరి తీయాలని, విడివిడిగా ఉరి తీయడానికి వీలు లేదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. నిర్భయ కేసులోని నలుగురు ముద్దాయిలకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తన వద్ద పెండింగ్‌లో ఉండటం అనేది ట్రయల్ కోర్టు ముద్దాయిల ఉరితీతకు తాజా తేదీ నిర్ణయించడానికి ఆటంకం కాబోదని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 14వ తేదీన స్పష్టం చేసింది. ఆ తరువాత ట్రయల్ కోర్టు నలుగురు ముద్దాయిల ఉరిశిక్షను అమలు చేయడానికి మార్చి మూడో తేదీని నిర్ణయించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు న్యాయమూర్తులు ఆర్.్భనుమతి, అశోక్ భూషణ్, నవీన్ సిన్హాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు మంగళవారం విచారణకు వచ్చింది. అయితే ధర్మాసనం ఈ అంశంపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ‘ఈ అంశాన్ని మార్చి అయిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు లిస్ట్ చేయాలి’ అని ధర్మాసనం తన ఆదేశాలలో పేర్కొంది. నిర్భయ కేసులోని నలుగురు ముద్దాయిల ఉరి శిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి అయిదో తేదీన కొట్టివేసిన విషయం తెలిసిందే.