క్రైమ్/లీగల్

దుర్గామాత విగ్రహంతో పాటు కోటి విలువ చేసే నాగమణి రాయి విక్రేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ముఠా, దుర్గామాత విగ్రహంతో పాటు కోటి రూపాయలు విలువ చేసే నాగమణి రాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సీపీ వెల్లడించారు. ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని చోరీలకు పాల్పడుతున్న సయ్యద్ యూసుఫ్, షేక్ సాహద్, సయ్యద్ శహ్‌బాజ్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.10 లక్షలకుపైగా విలువైన ఆభరణాలు, లక్ష రూపాయల విలువ చేసే గడియారం, రెండు బైక్‌లు, కొబ్బరి బొండాలు కట్ చేసే కత్తితోపాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ముఠాకు చెందిన సభ్యులు చోరీల బాట ఎంచుకున్నారు. అదేవిధంగా మరో కేసులో దుర్గామాత విగ్రహంతో పాటు కోటి రూపాయలు విలువ చేసే నాగమణి రాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారని అంజనీ కుమార్ తెలిపారు.