క్రైమ్/లీగల్

దాడి కేసులో నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఫిబ్రవరి 25: దాడికి పాల్పడిన వ్యక్తులను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 18న సాయంత్రం కోల్లూరి ఆనంద్, రాజ్‌కుమర్‌పై బీర్ బాటిళ్లు, కట్టెలు, గోడ్డళ్లతో దాడి చేసి గాయపరిచారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో నార్సింగి మున్సిపల్ వార్డు నెంబర్ 17 నుంచి క్యాతం అశోక్ యాదవ్, అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ యాదవ్ పోటీ చేశారు. ఎన్నికల్లో అశోక్ యాదవ్ ఓడిపోయాడు. ఫలితాల అనంతరం వెంకటేష్ తన అనుచరులు ఆనంద్, రాజ్‌కుమార్‌తో కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లారు. అశోక్ కూడా తన అనుచరులతో కలిసి మల్లన్న దర్శనానికి వెళ్లారు. అశోక్, ఆనంద్, రాజ్‌కుమార్ మధ్య గొడవ జరిగింది. అశోక్‌ను ఆనంద్, రాజ్‌కుమార్ కొట్టారు. కోమరవెల్లి పోలీస్‌స్టేషన్ కేసు నమోదైంది.
అశోక్ యాదవ్ కసి పెంచుకున్నాడు. నార్సింగికి చెందిన శివ, అతని అనుచరులు మరికొంత మంది గ్యాంగ్‌గా ఏర్పడి ఆనంద్, రాజ్‌కుమార్‌ను చంపేందుకు సుపారీ అందించాడు. ఈనెల 18న గండిపేట మైసమ్మ దేవాలయం వద్ద ఆనంద్ దావత్‌లో పాల్గొన్నాడు. శివ, అశోక్‌కు సమచారం తెలుసుకొని వెళ్లారు. గండిమైసమ్మ గుడి నుంచి కోకాపేట చౌరస్తా వరకు కారులో వెళ్తున్న ఆనంద్‌పై బీర్ సీసాలతో దాడి చేశారు. ఆనంద్ తప్పించుకున్నాడు. స్నేహితుడు సాయితో వస్తున్న రాజ్‌కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. రాజ్‌కుమార్ సృహ తప్పిపోయాడు. అతడు చనిపోయాడని అనుకొని అక్కడ నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసి శివకుమార్(33), బాల్‌రాజ్(36), శ్రీశైలం యాదవ్(32), మిట్టు, రాజ్ కుమార్(33)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. క్యాతం అశోక్ యాదవ్, గౌతమ్, శ్రీకాంత్, సతీష్, మహేష్ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.