క్రైమ్/లీగల్

కల్తీ వైన్ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఫిబ్రవరి 25: కొత్తపేట్‌లో కల్తీ వైన్ తయారు కేంద్రంపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు దాడి చేశారు. కల్తీ వైన్‌తో పాటు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం.. కొత్తపేట్ సరస్వతి నగర్ కాలనీలోని ఇంటిలో మహేశ్వరం శివప్రసాద్ అనే వ్యక్తి కల్తీ వైన్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు కే.పవన్ కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి, దాదాపు 20 లీటర్ల ద్రాక్షరసం, మూడు అట్టపెట్టెల్లో 60 కల్తీ వైన్ బాటిళ్లను గుర్తించారు. కల్తీ వైన్‌తో పాటు నిర్వాహకుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడులో ఎక్సైజ్ అధికారులు పీ.శ్రీ్ధర్, జీ.శ్రీనువాస్ రావు, వీ.గాయత్రి పాల్గొన్నారు.