క్రైమ్/లీగల్

గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువూరు, ఫిబ్రవరి 25: తిరువూరు, విస్సన్నపేట కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకుల్ని ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కల్లూరు ఏసీపీ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు, విస్సన్నపేట కేంద్రాలుగా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని సీలేరు నుంచి గంజాయిని ద్విచక్రవాహనంపై తెచ్చి విక్రయిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా తిరువూరుకు చెందిన కాకర్లమూడి అజయ్‌కుమార్, సంచి సంతోష్, గంపలగూడెం మండలం గోసవీడుకు చెందిన తంబిరాజు, విస్సన్నపేటకు చెందిన కంపా సాయికిరణ్, గుడిపూడి శివసాయిలతో పాటు హైదరాబాదులో బీటెక్ చదువుతున్న నూతక్కి సన్నిత్ గంజాయి రవాణా, అమ్మకంతో పాటు మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. సన్నిత్ ద్విచక్ర వాహనాన్ని రోజుకు రూ.700 అద్దె ప్రాతిపదికన హైదరాబాదులో తీసుకుని తిరువూరు వచ్చి తన మిత్రుల ద్వారా గంజాయి కొనుగోలుకు నగదు సరఫరా చేస్తున్నాడు. గంజాయి పొట్లాలను డిమాండ్‌ను బట్టి 25 గ్రాములు రూ.500 చొప్పున ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని సిగరెట్లలో, ఓసీబీ పేపర్లలో చుట్టి, బాటిల్స్‌లో బంగు పద్ధతిలో తాగడం నేర్పుతున్నట్లు వివరించారు. తిరువూరు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఈవిషయమై తెలంగాణా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి నిందితుల్ని మంగళవారం అదుపులోకి తీసుకుని వివరాలు వెల్లడించారు.