క్రైమ్/లీగల్

గొంతు నులిమి భర్తను చంపిన కసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హవేళి ఘణపూర్, ఫిబ్రవరి 25: తన అక్రమ సంబంధం బయటపడటం.. ఆ విషయంలో తనను భర్త నిలదీస్తున్నాడన్న కోపంతో భార్య అతడి గొంతు నులిమి చంపిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్, హవేళి ఘణపూర్ ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం హవేళి ఘణపూర్ మండలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన సగపొల్ల మల్లయ్య (50) బతుకు దెరువు కోసం మూడు సంవత్సరాలు పాటు దుబాయ్‌లో పనిచేసి ఇటీవలనే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. భర్త లేకపోవడంతో భార్య లక్ష్మీ ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన మల్లయ్య భార్యతో పలుమార్లు గొడవ పడ్డాడు. దీంతో సోమవారం రాత్రి భార్య లక్ష్మీ తన భర్త మల్లయ్యతో గొడవకు దిగి గోడకు నెట్టి గొంతు నులిమి చంపివేసింది. అనంతరం ఇంట్లో నిద్రపోతున్నట్టు మల్లయ్య శవాన్ని పడుకోబెట్టింది. అనుమానం రాకుండా మంగళవారం ఉదయానే్న చుట్టు పక్కల వారిని పిలిచి తన భర్త లేవడం లేదని తెలపడంతో చుట్టు ప్రక్కల వారు వచ్చి మల్లయ్య మరణించినట్టు నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్, హవేళి ఘణపూర్ ఎస్సై శేఖర్‌రెడ్డి శవాన్ని పరిశీలించారు. శవం గొంతుపై నల్లగా మారడంతో భార్య లక్ష్మీని నిలదీయగా తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజశేఖర్, ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.

*చిత్రం... భార్య చేతిలో మృతి చెందిన మల్లయ్య