క్రైమ్/లీగల్

సీఎం పేషీ అధికారుల పేరిట హాస్టళ్లలో వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 25: దేవరకొండ పట్టణంలోని సంక్షేమ హాస్టళ్లకు సోమవారం వెళ్లి తాము సీఎం పేషి నుండి వచ్చామని హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి వార్డెన్‌ల నుండి డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు నల్లగొండ వన్‌టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలిసింది. దేవరకొండ హాస్టళ్లకు వెళ్లిన తరహాలోనే మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమ శాఖకు వెళ్లి తాము సీఎం పేషీ నుండి వచ్చామంటూ నిందితులిద్దరూ హల్‌చల్ చేశారు. అంతకుముందు రోజునే ఇదే రీతిలో దేవరకొండ హాస్టళ్లకు ఇలాగే ఇద్దరు వ్యక్తులు వచ్చి వెళ్లిన ఘటన చోటుచేసుకోవడంతో వచ్చిన వ్యక్తులపై అనుమానం వచ్చిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వెంటనే వారి సమాచారాన్ని, ఫొటోలను పోలీసులకు అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుండి నల్లగొండ వన్ టౌన్ పోలీసులు కారు, ఓ తెలుగు మాసపత్రిక గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు మరింత విచారణ చేసిన పిదప పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.