క్రైమ్/లీగల్

కొడుకును చంపిన తల్లి, ప్రియుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 25: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కోపంతో ప్రియుడితో కలిసి కన్న కుమారుడిని హత్య చేసిన తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన నల్లగొండ రూరల్ పోలీసులు వారిని జైలుకు తరలించారు. డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు నల్లగొండ మండలం బుద్ధారం గ్రామం పాలేటి వెంకన్నకు భార్య విజయ, కొడుకు నాగరాజు ఉన్నారు. గ్రామానికి చెందిన తోకల వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద వెంకన్న అప్పు తీసుకున్నాడు.
అప్పు విషయమై వెంకట్‌రెడ్డి తరుచూ వెంకన్న ఇంటికి వస్తున్న క్రమంలో వెంకన్న భార్యతో అతడికి సంబంధం ఏర్పడింది. ఈ సంబంధాన్ని చూసిన విజయ కొడుకు నాగరాజు తండ్రి వెంకన్నకు తెలుపగా అతను విజయను కొట్టి మందలించాడు. తదుపరి ఈనెల 21న మరోసారి విజయ తన ఇంట్లో వెంకట్‌రెడ్డితో కలిసి ఉన్న సమయంలో నాగరాజు గమనించి మరోసారి తండ్రికి విషయం చెబుతాననడంతో అతని అడ్డు తొలగించుకునేందుకు వెంటనే అతడి గొంతునులిమి చంపివేశారు.
అనంతరం విజయ అత్త ఇంట్లోకి రాగా చనిపోయిన నాగరాజును గమనించగా అది చూసి విజయ ఇంటి నుండి వేగంగా బయటకు వెళ్లడం, అదే రోజు వెంకట్‌రెడ్డి సైతం గ్రామం నుండి వెళ్లిపోవడం జరిగాయి. నాగరాజు మృతిపై తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేసి జైలుకు తరలించినట్లుగా డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చేదించి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ టూటౌన్ సీఐ మహబూబ్‌బాషా, రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డిలను సిబ్బందిని ఆయన అభినందించారు.