క్రైమ్/లీగల్

పట్టుబడిన బంగారం బిస్కెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, ఫిబ్రవరి 25: అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం బిస్కెట్లు రవాణ చేస్తున్న ముఠా సభ్యులను మంగళవారం తెల్లవారుజామున షాద్‌నగర్‌వద్ద డీఆర్‌ఏ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాడిపత్రి పట్టణానికి చెందిన జ్యువెల్లరీ దుకాణాల యజమానులు కొందరు మధ్యవర్తుల ద్వారా దాదాపు 10 కిలోల బంగారం బిస్కెట్లను బస్సులో హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండగా సమాచారం అందుకున్న డీఆర్‌ఏ స్క్వాడ్ షాద్‌నగర్ వద్ద ఆ బస్సును ఆపి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఐదుగురు ముఠా సభ్యుల వద్ద ఈ బంగారం బిస్కెట్లు లభించినట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఏ స్వ్వాడ్ వెనుక ఉన్న వారి కోసం కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు పోలీసులకు దొరికినట్లు తెలుసుకున్న జ్యువెల్లరీ దుకాణ యజమానులు బెంబేలెత్తుతున్నారు.