క్రైమ్/లీగల్

జ్యుడీషియల్ కస్టడీకి ఎంపీ అజం ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 26: సమాజ్‌వాది పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు అజం ఖాన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆయనతో పాటు భార్య, ఎమ్మెల్యే తాన్‌జీన్ ఫాతిమా, కుమారుడు ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజంను కూడా మార్చి 2వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా బుధవారం పిటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. అజం కుమారుడు అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రాల్లో పుట్టిన తేదీని తప్పుగా చూపించారని ఎస్‌పీ చెప్పారు. తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం నేరమని, ఈ కేసులోనే ఆయన్ను అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. అయితే సమాజ్‌వాది పార్టీ మాత్రం ఈ అంశాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించింది. యూపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సీనియర్ నాయకుడు అజం ఖాన్, ఆయన భార్య, కుమారుడిపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నదని ఆ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటిస్తామని, అదేవిధంగా పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టాలని చేసే ఎలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించింది.