క్రైమ్/లీగల్

ఆలయాల స్వాధీనంపై సీఎం మొండివైఖరి తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, ఫిబ్రవరి 26: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్‌దామ్ సహా ఉత్తరాఖండ్‌లోని 50 దేవాలయాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిర్ణయాన్ని తీర్థ పురోహితులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తూ దేవస్థాన నిర్వహణ చట్టాన్ని తీసుకురావడాన్ని పురోహితులు ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటారో? లేక కోర్టులో తేల్చుకోమంటాలో చెప్పాలని వీరు అల్టిమేటం ఇచ్చారు. చార్‌దామ్ సహా 50 ప్రఖ్యాత దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాల్సిందిగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో రాష్ట్ర అసెంబ్లీ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈమేరకు ప్రభుత్వ ఆధీనంలోని ప్యానల్ కమిటీకి అనుమతులు జారీ చేసింది. ‘మా నేతృత్వంలో దశాబ్దాలుగా నడుస్తున్న దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొన్నారు.. ఇది ఆయనకు ఎంతమాత్రం మంచిది కాదు.. దీనిపై ఆయన పునరాలోచించుకోవాలి’ అని గంగోత్రి మందిర్ సమితిని గతంలో నిర్వహించిన అశోక్ సేమ్‌వాల్ పీటీఐకి తెలిపారు. ‘ముఖ్యమంత్రి నిర్ణయాన్ని యావత్ పురోహితుల సమాజం వ్యతిరేకిస్తోంది.. కనీసం తమను సంప్రదించకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటారు.. దీనిని మాకు జరిగిన అవమానంగా భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఏకపక్షంగా దేవాలయాల నిర్వహణ చట్టాన్ని తీసుకురావడం ఎంతమాత్రం తగదన్నారు. మా జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావితం చూపే విధంగా చట్టాన్ని తీసుకురావడం గమనార్హం అని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆర్థిక రంగంపై ప్రభావితం చూపే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్థ పురోహితులంతా కలిసి సీనియర్ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామిచే ఉత్తరాఖండ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయించామని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తీర్థ పురోహితులంతా కలిసి విడిగా కోర్టును ఆశ్రయించనున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యాన్ని కోరనున్నామని ఆయన వివరించారు. తీర్థ పురోహితుల అభిమతానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ చట్టం రద్దుకు చొరవ చూపాల్సిందిగా మోదీని కోరనున్నామని చెప్పారు. ఆలయాలను మరింత సమర్థవంతంగా నడపడం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నాం.. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఈ చట్టం ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా హేతబద్ధమో తెలియజేయాలని సవాలు చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిల్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లో సమాధానం చెప్పాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది.