క్రైమ్/లీగల్

ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల కబ్జాపై హైకోర్టు బుధవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించింది. హైకోర్టుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమా ర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హాజరయ్యారు. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాపై 40కి పైగా ప్రజావ్యాజ్య పిటిషన్లు ఉండడంతో పరిస్థితి తీవ్రత తెలుస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. స్థలాలు కబ్జా అవుతున్నా ప్రభుత్వానికి బాధ లేదనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కబ్జాదారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. దేవుడు, మతం పేరిట అక్రమ నిర్మాణాలకు అనుమతించరాదని పేర్కొం ది. గత ఐదేళ్లలో నిర్మించిన మతపరమైన అక్రమ కట్టడాలపై సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ముందుగా జంటనగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. మతపరమైన అక్రమ నిర్మాణాలపై పాలసీ రూపొందించాలని సూచించింది. అమీన్‌పూర్ రాక్‌గార్డెన్ ఆలయ నిర్మాణపై తనిఖీలకు ప్రవీణ్‌రెడ్డిని అడ్వకేట్ కమిషన్‌గా నియమించింది. అడ్వకేట్ కమిషన్‌కు 50వేలు చెల్లించాలని, ఆలయ కమిటీకి భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించింది. కమిషన్‌కు పూర్తిగా సహకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పార్కు ఆలయ నిర్మాణంపై ప్రభు త్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో రెవెన్యూ శాఖ తరఫున న్యాయవాది కౌంటర్‌ను ఉపసంహరించుకున్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.