క్రైమ్/లీగల్

కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 26: ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. బాధితుడు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. బాధితుడు రవితేజ బుధవారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి కారులో బాలానగర్ నుంచి మేడ్చల్‌కు బయలుదేరాడు. సరిగ్గా మేడ్చల్ మండల పరిధిలోని బాసరాయగడి గ్రామం వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ. మంటలను గమనించిన రవితేజ, అతడి స్నేహితుడు కారులో నుంచి దిగిపోయారు. కొద్ది క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలతో కారు పూర్తిగా దగ్ధమైంది. బ్యాటరీలో షార్ట్ సర్కూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. కాగా, మంటలను సకాలంలో గుర్తించడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు.