క్రైమ్/లీగల్

ఈవెంట్ మేనేజర్ పట్ల అసభ్య ప్రవర్తన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 26: బర్త్ డే సెలబ్రేషన్స్ ఈవెంట్‌కు ఈవెంట్ ఆర్గనైజర్‌గా వ్యవహరించిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మహిళను కత్తులతో బెదిరించి నగ్నంగా నృత్యం చేయాలని ఒత్తిడి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో డ్యాన్స్ చేసి తెల్లవారుజామున ఎవరూ చూడని సమయంలో తప్పించుకుని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... ఈ నెల 22వ తేదీన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నెం. 202 వద్ద గల ఓ అపార్ట్‌మెంట్‌లోబర్త్‌డే వేడుకలు జరిగాయి. బర్త్‌డే వేడుకలను అమీర్, రజాత్‌అలీ, సుల్తాన్ సలీంలు నిర్వహించారు. ఈ వేడుకలను నిర్వహించేందుకు ఈవెంట్ ఆర్గనైజర్‌గా ఓ మహిళ వ్యవహరించింది. మద్యంమత్తులో నిర్వాహకులు డ్యాన్స్ చేయాలని ఒత్తిడి చేశారు. డ్యాన్స్ చేయడం ఇష్టంలేని ఆ మహిళ చేయనని చెప్పడంతో కత్తులతో బెదిరించారు. అంతేకాకుండా నగ్నంగా ఆడాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సదరు మహిళ తప్పనిసరి పరిస్థితుల్లో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అనంతరం ఆ మహిళను రూమ్‌లో బందించి చిత్రహింసలకు గురిచేశారు. తాగిన మత్తులో నిర్వాహకులు ఉండడడంతో ఆ మహిళ 23వ తేదీన తెల్లవారుజామున తప్పించుకొని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.