క్రైమ్/లీగల్

రిటైర్డు ఏఎస్‌ఐ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 26: ఇంట్లో సమాచారమివ్వకుండా బయటకు వెళ్లిన ఓ రిటైర్డు అసిస్టెంటు సబ్ ఇన్‌స్పెక్టర్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం మయూర్‌మార్గ్‌లోని బాలకృష్ణ నిలయంలోని ఫ్లాట్ నెంబర్ 102లో రిటైర్డు అసిస్టెంటు సబ్ ఇన్‌స్పెక్టర్ భోంస్లే భవానీరావు(63) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈనెల 20వ తేదీన సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంట్లో ఎవరికి సమాచారమివ్వకుండా వెళ్లిపోయిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు. తండ్రికి ఇంటికి రాకపోవటంతో ఆయన కుమారుడు, ప్రైవేటు ఉద్యోగి అయిన భోంస్లే సాయికుమార్ తండ్రి ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల వద్ద కూడా వెతికినా, ఫలితం దక్కకపోవటంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. అదృశ్యమైన ఏఎస్‌ఐ బూడిదరంగు షర్టు, తెల్లటి లుంగీ ధరించి ఉన్నట్లు ఆయన కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయికుమార్ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*రిటైర్డు అసిస్టెంటు సబ్ ఇన్‌స్పెక్టర్ భోంస్లే భవానీరావు(ఫైల్‌ఫొటో)