క్రైమ్/లీగల్

పట్టపగలు రూ. 4.80 లక్షలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 27: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో వా రం తిరక్కముందే పట్టపగలు మరో దొంగతనం చోటు చేసుకుంది. దీంతో కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి పరుగులు తీయాల్సి వచ్చింది. వా రంలోపే రెండు దొంగతనాలు చోటు చేసుకోవటంతో పోలీసులు కంగుతిన్నారు. జక్కంపూడి గ్రామంలో ఓ ఇం ట్లోకి మారుతాళంతో ప్రవేశించిన గు ర్తు తెలియని దుండగులు రూ.20వే లు నగదు, రూ.4.60లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు దోచుకుపోయారు. పోలీసుల కథనం ప్రకా రం జక్కంపూడి గ్రామానికి చెందిన ధరణికోట శ్రీనివాసరావు అదే ప్రాం తంలో బార్బర్ షాపునిర్వహిస్తూ జీవ నం సాగిస్తున్నాడు. అతని భార్య అదే గ్రామంలోని సాయిదుర్గ అగ్రో ఇండస్ట్రీస్‌లో అప్పడాల తయారీ పనులు చే స్తుంటుంది. గురువారం ఉదయం దంపతులిద్దరూ ఎవరి పనుల మీద వారు బయటకు వెళ్లిపోయారు. ఇంట ర్ చదువుతున్న కుమార్తె, ఆరో తరగతి చదువుతున్న కుమారుడు కూడా కళాశాల, పాఠశాలలకు వెళ్లిపోయా రు. సమీప బంధువుల అంతిమక్రతువుకు హాజరైన శ్రీనివాసరావు పనిమీద గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తా ళాలు తీసి ఉన్నాయి. లోపలకు వెళ్లి ప రిశీలించగా బీరువాలోని బంగారునగ లు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. వాటితో పాటు రూ.20వేల నగదు కూడా గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నట్లు బాధితుడు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న కొత్తపేట క్రైం ఎస్ ఐ కృష్ణ తన సిబ్బందితో పాటు నేరస్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం, వేలిముద్రల నిపుణులు రంగంలోకి దిగి సంఘటనా స్థలంలో నేరస్థుల వేలిముద్రలను సేకరించారు. ఇదిలా ఉండగా భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోని అలమరాలో ఉంచిన బం గారపు ఉంగరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పోలీసుల కు ఫిర్యాదు అందింది. కబేళా సెంటర్ కు చెందిన బత్తిన రామాంజనేయకుమార్ అనే వ్యక్తి చిట్టినగర్ ప్రైజర్‌పేటలోని సిద్దు కార్ ట్రావెల్స్‌లో గుమస్తా గా పని చేస్తుంటాడు. వీరి కుటుంబ సభ్యులు బంగారపు వస్తువులను అలమరాలో పెట్టడం ఆనవాయితీ. ఈనెల 26న అలమారలో ఉంచిన 5గ్రాముల వెంకటేశ్వరస్వామి బంగారపు ఉంగ రం కనిపించలేదు. దీంతో గురువారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం ఎస్‌ఐ కృష్ణబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.