క్రైమ్/లీగల్

డ్రైవర్‌కు జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 27: మేడ్చల్ హైవేలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వ్యక్తులకు తీవ్ర గాయాలకు గురిచేసిన లారీ డ్రైవర్‌కు శిక్షను మేడ్చల్ 22వ మెట్రోపాలిటన్ న్యాయస్థానం న్యాయమూర్తి నాగరాజు విధించారు. ఆరు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయ జరిమానా విధిస్తూ గురువారం తీర్పును వెల్లడించారు. మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సంవత్సరం జూన్ 22న మేడ్చల్ ప్రాంతానికి చెందిన సురేందర్, అతని స్నేహితుడు నర్సింహ ద్విచక్ర వాహనంపై వస్తుండగా మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద వీఆర్‌ఎల్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీడ్రైవర్ రామన్నగౌడ వాడార్ నిర్లక్ష్యంగా లారీని నడిపి బీభత్సం సృష్టించాడు. ప్రమాదంలో సురేందర్, నర్సింహకు తీవ్ర గాయాలయ్యాయి. వాదోపవాదాలను న్యాయమూర్తి నాగరాజు విని డ్రైవర్ రామన్నగౌడ వాడార్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తుది తీర్పును వెల్లడించారు.