క్రైమ్/లీగల్

రౌడీషీటర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, ఫిబ్రవరి 27: అనుమానస్పదస్థితిలో రౌడీషీటర్ హత్యకు గురైన సంఘటన వెంకటాపురంలోని కోత్తబస్తీలో జరిగింది. అల్వాల్ పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం గురువారం కోత్తబస్తీ నివాసి మైకెల్ పైన కేసులు ఉండటంతో రెండు ఏళ్ల క్రితం రౌడీషీట్‌ను నమోదు చేశారు. ఆరు మాసాలుగా రహస్యంగా నివాసం ఉంటున్నాడని తెలిపారు. గురువారం తెల్లవారు ఝామున గుర్తు తెలియని వ్యక్తులు మైకెల్‌పై దాడిచేసి గుడిసెలోకి తీసుకెళ్లి కాల్చివేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని గాంధీ ఆసుపత్రి పోస్టుమార్టంకు తరలించారు. ఘటన స్థలాన్ని బాలనగర్ డీసీపీ పద్మజారెడ్డి, ఎసీపీ నర్సింహా రావు పరిశీలించి వెంటనే కేసులోని నిందితులను పట్టు కోవాలని ఇందుకు కావల్సిన చర్యలు తీసుకోవాలని అల్వాల్ సీఐ పులి యాదగిరిని డీసీపీ పద్మజా రెడ్డి ఆదేశించారు.