క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), ఫిబ్రవరి 27: అనుమానాస్పదంగా వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన పెందుర్తి పరిధిలో గురువారం జరిగింది. బంగారు ఆభరణాల కోసమే దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నరవ సమీపంలోని దుర్గానగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి జెర్రిపోతుల సముద్రాలు(75), భార్య పార్వతి(65) దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. ఇంట్లో ప్రస్తుతం భార్యభర్తలిద్దరే ఉంటున్నారు. ఉద్యోగ రీత్యా కుమారుడు వీరశేఖర్ సత్యం జంక్షన్ వద్ద నివాసముంటున్నట్టు పోలీసులు తెలిపారు. తరుచూ అమ్మానాన్నతో కుమారుడు ఫోన్‌లో మాట్లాడుతూ వారితో టచ్‌లో ఉంటున్నట్టు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే బుధవారం రాత్రి 12 గంటలకు నరవలోని తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి రాత్రి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో లైట్లు వెలిగించి ఉండడంతో తల్లిదండ్రులను పిలవగా వారు పలకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ గుండా చూడవా వారిద్దరూ కిందపడి ఉండడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు కుమారుడు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా వారిద్దరూ మృతి చెందినట్టు గుర్తించారు. అయితే తల్లి ఒంటిపై ఉండాల్సిన చెవిపోగులు, పుస్తెలతాడు, హారంతో పాటు నగదు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు వాటి కోసం తన తల్లిదండ్రులను హత్య చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని వీరశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పశ్చిమ ఏసీపీ జీ స్వరూపారాణి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్టు బట్టి కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుందని పోలీసులంటున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించారు.