క్రైమ్/లీగల్

భార్యకు చిత్రహింసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (నార్సింగి), ఫిబ్రవరి 27: కట్టుకున్న భార్యను మూడు రోజులు చిత్రహింసలకు గురి చేసిన సంఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గంగాధన్ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పానుగంటి శ్రీనివాస్‌కు 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలకు ఇద్దరు సంతానం. బతుకు దెరువు కోసం గండిపేట మండలం కోకాపేటలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలం నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 24వ తేదీ రాత్రి మద్యం సేవించి వచ్చిన శ్రీనివాస్ భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ వివస్తన్రు చేసి దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా కొడుకుతో సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు. తీవ్రగాయాలకు గురైన భార్య తప్పించుకుని పుట్టింటికి వెళ్లి జరిగిన సంఘటనను తెలిపింది. దీంతో మహబూబ్‌నగర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. ఈ మేరకు నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*చిత్రం... నిందితుడు శ్రీనివాస్‌