క్రైమ్/లీగల్

ఒడిశాలో ముగ్గురు గిరిజనుల కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఫిబ్రవరి 27: ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు బుధవారం అర్ధరాత్రి అపహరించారు. మల్కనగిరి జిల్లా దంత్రి గ్రామానికి చెందిన అర్జున్ అనే గిరిజనుడితో పాటు దంత్రికి ఆనుకుని ఉన్న మరో రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు అపహరించినట్టు తెలుస్తోంది. మూడు బృందాలుగా విడిపోయిన మావోయిస్టులు ఈ మగ్గురు గిరిజనులు నివాసం ఉంటున్న గ్రామాలకు అర్ధరాత్రి దాటిన తరువాత చేరుకున్నట్టు తెలుస్తోంది. తమ తమ గ్రామాల్లో ఇళ్లల్లో నిద్రిస్తున్న ముగ్గురు గిరిజనులనూ నిద్రలేపి తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా భావించి అపహరించిన ఈ మగ్గురు గిరిజనులను మావోయిస్టులు గురువారం ప్రజాకోర్టులో విచారించినట్టు తెలుస్తోంది. జంతిరాయి అటవీ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టులపై గిరిజనులు దాడి చేసిన ఘటనలో మావోయిస్టు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ సంఘటన మావోయిస్టు వర్గాలలో తీవ్ర కలకలం రేపగా పోలీసుల ప్రోద్బలంతోనే గిరిజనులు తమపై దాడి చేసినట్టుగా మావోయిస్టులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఘటనకు సూత్రధారులుగా భావించిన ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు అపహరించినట్టుగా చెబుతున్నారు. అపహరించిన గిరిజనులను ప్రజాకోర్టులో విచారించిన అనంతరం వీరిని మావోలు హతమార్చినట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నప్పటికీ నిర్థారణ కాలేదు. ఇదిలాఉండగా ఒడిశాలోని దంత్రి ప్రాంతంలో ముగ్గురు గిరిజనులు అపహరణకు గురైన సంఘటనతో విశాఖ ఏజెన్సీలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ గిరిజన ప్రాంతానికి ఆనుకుని ఒడిశాలోని మల్కనగిరి జిల్లా ఉండడంతో స్థానిక పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.