క్రైమ్/లీగల్

కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: దాదాపు దశాబ్దం క్రితం నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా సమయంలో విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత కేసు విచారణలో భాగంగా గురువారం నాడు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో డీ శ్రీనివాస్ వెర్సస్ ఎండల లక్ష్మీనారాయణ బరిలో ఉన్నపుడు టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి కవిత వెళ్లారు. సెక్షన్ 30 అమలులో ఉన్నపుడు ధర్నా చేయడం నిషేధం. అందుకు గానూ ఆమెపై పోలీసులు ఐపీసీ 341, 188 సెక్షన్లు నమోదు చేశారు. కవితతో పాటు మోపినేని నిర్మల వైఫాఫ్ నరేందర్ రాయుడు, ఝాన్సీరాణీ, జుగల్ కిశోర్‌లపై ఈ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కవిత హాజరైనా, మిగిలిన వారు హాజరు కాలేదు. ఏ-3గా ఉన్న ఝాన్సీ రాణి మరణించారని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఏ-2 మోపినేని నిర్మల, ఏ-4 జుగల్ కిశోర్‌లు కోర్టుకు హాజరుకాలేదు. ఇరుపక్షాల వాదలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. అప్పట్లో కవిత ప్రసంగంపై న్యాయవాది కే కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
సామాజిక మాద్యమాల యాజమాన్యాలపై పిటిషన్
సామాజిక మాద్యమాల యాజమాన్యాలపై పిటిషన్ దాఖలైంది. వాట్సప్, టిక్‌టాక్, ట్విట్టర్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పిటిషనర్ శ్రీశైలం తెలిపారు. ఈ యాప్‌లలో అనేక మంది కొన్ని మతాలకు అనుకూలంగానూ, మరికొన్ని మతాలకు వ్యతిరేకంగానూ కామెంట్లు పోస్టు చేస్తున్నారని, ముఖ్యంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కుచెందిన కొన్ని వాట్సప్ గ్రూప్‌లలో ఇండియన్స్ చేరుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. కానీ వాటిని నిరోధించే అవకాశం ఉన్నా యాప్ యాజమాన్యాలు నియంత్రించడం లేదని అన్నారు. దీంతో అలా పోస్టింగ్‌లు పెడుతున్న వ్యక్తులు, గ్రూప్ అడ్మిన్‌లు మీద కాకుండా ఆయా యాప్‌ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పిటిషనర్ వాదనలు విన్న నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆయా యాప్‌ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదుచేయాలని తీర్పు వెల్లడించారు.
దీంతో వారిపై 153(ఏ), 121(ఏ), 294,295,505, 120(బీ), రెడ్ విత్ 156(3) కింద కేసులు పెట్టారు. ఇంత వరకూ 1200 గ్రూప్‌లు ఏర్పాటు చేసి జాతికి వ్యతిరేకంగా వీటిలో కామెంట్లు పెడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా సామాజిక మాద్యమాల యాజమాన్యాలకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్టు ఆయన చెప్పారు.