క్రైమ్/లీగల్

చిలుకా.. చిలుకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, ఫిబ్రవరి 29: తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా పోయిందని వెతికి పెట్టాలంటూ ఎల్లారెడ్డిగూడాకు చెందిన బాధితుడు సంజీవరెడ్డినగర్ (ఎస్సార్‌నగర్) పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే యూసఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడకు చెందిన రామలింగేశ్వర రావు అరుదైన ఆస్ట్రేలియన్ కాకిటేల్ రకానికి చిలుకను పెంచుకుంటున్నాడు. తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిలుకను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడని, దానిని వెతికి తనకు అప్పగించడంతో పాటు సదరు వ్యక్తిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ఓ ద్విచక్రవాహనంపై వెలుతున్న వ్యక్తి చిలుకను తీసుకువెళ్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.