క్రైమ్/లీగల్

ఆటో పల్టీకొట్టి మహిళ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఫిబ్రవరి 29: ఆటో పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం స్థానిక నాగాయలంక రోడ్డులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త మాజేరు గ్రామానికి చెందిన తమ్ము బాల (72), కొక్కిలగడ్డ గంగమ్మ, లంకె లక్ష్మి, అనుగొంది తిరుపతమ్మ చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. నాగాయలంక చేపల మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేసేందుకు ఉదయానే్న కొత్త మాజేరు నుండి చల్లపల్లి బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న సర్వీస్ ఆటోలో నాగాయలంక బయలుదేరి వెళ్లారు. ఆటో బయలుదేరి కొద్దిసేపటికే బస్టాండ్ సెంటర్ - కోట పెద్ద దర్వాజా దాటి సంతలోనే ఆటో పల్టీ కొట్టింది. ఎదురుగా వచ్చిన కూరగాయల తోపుడు బండిని తప్పించబోయి ఆటో బోల్తా పడగా ఆటోలో ఉన్న తమ్ము బాల అక్కడిక్కడే మృతి చెందింది. మిగిలిన వారు గాయపడగా అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చల్లపల్లి ఎస్‌ఐ పి నాగరాజు ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.