క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, ఫిబ్రవరి 29: రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా మరోఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని జీపీకే రహదారిపై తమిరిశ వద్ద శనివారం జరిగింది. నందివాడ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ అనిల్ కథనం ప్రకారం పోలుకొండ నుండి గుడివాడ వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుడివాడ నుండి పోలుకొండ వైపువస్తున్న మరోద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈప్రమాదంలోలక్ష్మీనరశింహాపురం గ్రామానికి చెందిన హనుమంతు రామకృష్ణ (40) అనే వ్యక్తి రోడ్డు మీద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికి అక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన నానుపాత్రుని రంగారావుఅనే వ్యక్తికి, గుడివాడలోని వాంబేకాలనీకి చెందిన కాకి జోసఫ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.