క్రైమ్/లీగల్

మళ్లీ కోర్టుకు నిర్భయ దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: నిర్భయ కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ కుమార్ గుప్తా ఉరిశిక్ష అమలు నిలిపేయాలంటూ ఢిల్లీను ఆశ్రయించారు. ఉరి అమలుపై స్టే కోరుతూ ముద్దాయిల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్ వేశారు. నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో న్యాయస్థానం నలుగురు మృగాళ్లకు ఉరి శిక్ష వేసింది. వివిధ కారణాలతో ఇప్పటికే ఉరిశిక్ష అమలు రెండు సార్లు వాయిదా పడింది. మార్చి 3న ఉరిశిక్ష అమలుకు కోర్టు డెత్‌వారెంట్ జారీ చేసింది. దీనిపై మల్లీ దోషులిద్దరు కోర్టును ఆశ్రయించారు. దోషుల పిటిషన్‌ను విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా తీహార్ జైలు అధికారులకు నోటీసు జారీ చేశారు. సోమవారం లోగా వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అక్షయ్‌సింగ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్టప్రతి వద్ద పెండింగ్‌లో ఉందని న్యాయవాది సింగ్ కోర్టుకు తెలిపారు. ఇంతకు ముందు అతడు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సరైన కారణాలూ చూపకుండానే తిరస్కరించారని ఆరోపించాడు. అలాగే మరొక దోషి పవన్ కుమార్ గుప్తా కూడా శుక్రవారం సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. గుప్తా క్షమాభిక్ష పిటిషన్ వేసుకునేందుకు అవకాశం ఉందని అతడి తరఫున్యాయవాది కోర్టుకు తెలిపాడు. సుప్రీం కోర్టు, వివిధ విభాగాల్లో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున మార్చి 3న ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని దోషులిద్దరూ కోర్టును అభ్యర్థించారు. నిర్భయ కేసులో ముకేష్ కుమర్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్‌కుమార్ శర్మ(26), అక్షయ్ సింగ్(31)కు ఉరిశిక్ష అమలు చేయాలని ఫిబ్రవరి 17న కోర్టు తీర్పునిచ్చింది. మార్చి 3న ఉరిశిక్ష అమలుకు సంబంధించి డెత్‌వారెంట్ జారీ అయింది. అయితే న్యాయపరంగా ఉన్న అవకాశాలు వినియోగించుకోడానికి దోషులకు కోర్టు వెసులుబాటు కల్పించింది. నలుగురు దోషులను మార్చి 3న ఉదయం 6 గంటలకే ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. దానికి సంబంధించి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. తాజాగా దోషులిద్దరు కోర్టును ఆశ్రయించడం శిక్ష అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు డెట్‌వారెంట్లు జారీ చేశారు. దోషులు నలుగురిలో ఒకడు పవన్ గుప్తా ఇప్పటి వరకూ క్యూరేటివ్ పిటిషన్ వేసుకోలేదు. న్యాయపరంగా తనకున్న హక్కును ఉపయోగించుకోడానికి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తులు దానిపై నిర్ణయం తీసుకోవల్సి ఉంది. అలాగే అతడు క్షమాభిక్ష అభ్యర్థన చేసుకోలేదు. అతడికి ఆ అవకాశం కూడా ఉంది. ఇలా ఉండగా నిర్భయ దోషులు నలుగుర్నీ జనవరి 22న ఉరి తీయాలని కోర్టు తీర్పు తీర్పునివ్వగా ఫిబ్రవరి 1కు వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. మళ్లీ ట్రయల్ కోర్టు జనవరి 31న స్టే ఇవ్వడంతో మార్చి 3న తీర్పు అమలుకు డెత్‌వారెంట్ జారీ అయింది. తమ కుమార్తె జీవితాన్ని అత్యంత పాశవికంగా చిదిమేసిన నలుగురు మృగాళ్లకు త్వరగా శిక్ష అమలు చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా శిక్ష అమలు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది.