క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 1: గుంటూరు జిల్లాలో ఆదివారం అతివేగం రూపంలో మృత్యువు పలువురి ప్రాణాలను కబళించింది. అతివేగంగా వాహనాలు నడిపి అదుపు చేయలేక రోడ్డు ప్రమాదాలకు గురై కొందరు తమ కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టగా, మరికొందరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వట్టిచెరుకూరు, వెల్దుర్తి మండలాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వట్టిచెరుకూరు మండలం ఐదో మైలురాయి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏమిజరిగిందో తెలుసుకునేలోపే ఆరుగురు విగతజీవులయ్యారు. 11మందితో అతివేగంగా ప్రయాణిస్తున్న టవేరా వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి ఐదో మైలురాయి ప్రాంతంలోని వంతెనను ఢీకొట్టి లోతైన వాగులో బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రసాదం వన్నూరు (65), పొగడ్త రమణ (55), పొగడ్త సీతమ్మ (60), పొగడ్త వీరలక్ష్మి (55), కోమదల శ్రీనివాసరావు (50-డ్రైవర్), బొజ్జ సుబ్బమ్మ (55) ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుంటూరు రూరల్ ఏటుకూరులో బంధువుల ఇంట శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో 8కిలోమీటర్ల దూరం వెళ్లిన 15నిముషాల వ్యవధిలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు ఆనందంగా గడిపి తమ ఇళ్లకు తిరుగుముఖం పట్టిన వారిలో కొందరు
తిరిగిరాని లోకాలకు, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రులకు చేరారు. ప్రమాదానికి గురైన వారంతా కాకుమాను గ్రామస్తులని పోలీసులు గుర్తించారు. జిల్లా అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వెల్దుర్తి మండలంలో..
ఇలావుంటే వెల్దుర్తి మండలం లచ్చమళ్లపాడు - శ్రీరామ్‌పురం తండా వద్ద మిర్చి లోడ్‌తో వెళుతున్న లారీ క్వారీ గుంతలో పడిపోయిన ఘటనలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు కూలీలు మృతిచెందారు. శ్రీరామ్‌పురం తండాలోని మిరపకాయలను బొందలవీడుకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేయగా ఆదివారం సాయంత్రం బొందలవీడుకు చెందిన 10మంది ముఠా సభ్యులు లారీలో లోడ్ చేశారు. లారీని రివర్స్ చేసే క్రమంలో అదుపుతప్పి క్వారీ గుంతలో పడిపోవడంతో ముగ్గురు కూలీలు, డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నాయుడు సాంబయ్య, సాదనాల శ్రీహరి, నాయుడు రమేష్, సాదనాల శ్రీనివాసరావు ప్రాణాలు క్వారీ గుంతలోనే ఆవిరయ్యాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

*చిత్రాలు.. గుంతలో పడిన మిర్చిలోడు లారీ, పక్కన మృతదేహాలు
*ఘటనాస్థలిలో మృతదేహాలు. వివరాలు తెలుసుకుంటున్న అర్బన్ ఎస్పీ రామకృష్ణ