క్రైమ్/లీగల్

కారు ఢీకొని ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 1: మద్యం మత్తులో కారు నడిపి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కీసర అనుబంధ గ్రామమైన వనె్నగూడకు చెందిన రాయపురం కృష్ణ(48), మంత్రాల నర్సింహ(38) ద్విచక్ర వాహనంపై భోగారం గ్రామం నుంచి వనె్నగూడ వైపు వెళ్తున్నారు. వనె్నగూడకు వెళ్లే రోడ్డు దాటుతుండగా భోగారం వైపు నుంచి అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న కృష్ణ, నర్సింహను కారు కొంత దూరం ఈడ్చు కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన కృష్ణ, నర్సింహ అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ క్రషర్ మిషీన్‌లో విధులు నిర్వహించేవాడు. నర్సింహ కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో దినసరి కూలీగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపారని తెలిపారు. కారు డ్రైవర్ దుర్గం వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.