క్రైమ్/లీగల్

మధ్యప్రదేశ్‌లో గూడ్సు రైళ్ళ ఢీ: ముగ్గురు డ్రైవర్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగ్రౌలి, మార్చి 1: మధ్య ప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో రెండు గూడ్సు రైళ్ళు ఎదురెదురుగా ‘ ఢీ’కొనడంతో ఇంజన్‌లో ముగ్గురు డ్రైవర్లు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. మధ్య ప్రదేశ్‌లోని గన్‌హరి గ్రామం నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు బయలుదేరి ఏడు కిమీ వెళ్ళిన తర్వాత దుర్ఘటన జరిగిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ షెండె పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఎదురెదురుగా వస్తున్న గూడ్సు రైళ్ళు ఢీకొనడంతో ఇంజన్‌తో పాటు ఖాళీగా ఉన్న 11 బోగీలు పట్టాలు తప్పాయని ఆయన తెలిపారు. రెండు గూడ్సు రైళ్ళ ఇంజన్లు ఢీకొనడంతో అందులో ముగ్గురు డ్రైవర్లు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. ఆ ఇంజన్లలో ఇరుక్కుపోయిన ముగ్గురి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసినట్లు ఆయన తెలిపారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు (ఎన్‌టీపీసి)కి బొగ్గు తరలిస్తున్న గూడ్సు రైలుకు ప్రమాదం జరిగిందని ఎస్‌పీ షెండే తెలిపారు. అందుకు కారణం ఈ ట్రాక్ ప్రత్యేకించి ఎన్‌టీపీసీకి సంబంధించిందన్నారు. ఇదిలాఉండగా ఈ రైలు ప్రమాదంతో భారతీయ రైల్వేకు ఏ మాత్రం సంబంధం లేదని ఈశాన్య కేంద్ర రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి రాజేష్ కుమార్ తెలిపారు.

*చిత్రం... మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఓ బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు
సింగ్రోలి వద్ద ఓ గూడ్సు రైలును ఢీకొన్న దృశ్యం