క్రైమ్/లీగల్

ఉరిశిక్షకు ఒక్క రోజు ముందు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ రేప్, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. దోషులు నలుగురి లో ఒకడైన పవన్‌గుప్తాను కూడా ఈనెల మూడో తేదీన ఉరితీయాల్సి ఉంది. ఉరికి ఒక్క రోజు ముందు పవన్‌గుప్తాకు న్యాయపరంగా మిగిలి ఉన్న ఏకైక అవకాశమైన క్యురేటివ్ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎన్‌వీ రమణ తన చాంబర్‌లో విచారిస్తారు. జస్టిస్ ఎన్వీ రమణతో పాటు అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారీమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్ ధర్మాసనం క్యురేటివ్ పిటిషన్‌ను విచారిస్తారు. 2012లో జరిగిన నిర్భయ ఘటనకు సంబంధించి అప్పట్లో తాను మైనర్‌ననీ.. తన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ పవన్‌గుప్తా క్యురేటివ్ పిటిషన్‌లో కోరాడు. పవన్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులో విచారించాల్సిందిగా ఆదివారం కోరారు. ట్రయల్ కోర్టు ఆదేశం మేరకు 3న నలుగురు దోషులనూ ఉరి తీయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు న్యాయపరంగా మిగిలిన ఉన్న ఏకైక అవకాశమైన క్యురేటివ్ పిటిషన్‌లో ఉరి శిక్ష తీవ్రతను తగ్గించి జీవితఖైదుగా మార్చాలని కోరుతూ పవన్‌గుప్తా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాడు.