క్రైమ్/లీగల్

అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలియా: కామంతో కళ్లు మూసుకుపోయ 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాలియా సీఐ జీ.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామానికి చెందిన వడ్డేగోని గోపమ్మ (90) అనే వృద్ధురాలు ఒంటరిగా మారేపల్లిలోని ఒక చిన్న ఇంట్లో ఉంటోంది. ఆమెకు ఐదుగురు కుమారులు ఉండగా నెలకు ఒకరి వద్ద ఉంటోంది. ఆదివారం తల్లికి టీ ఇద్ద్దామని వెళ్లేసరికి ఇంటిలో పడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయి వెళ్లి పరిశీలించగా చనిపోయిందని గుర్తించాడు. ఇంటి చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించగా ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు గుర్తించారు. ఆమె చిన్న కుమారుడైన లక్ష్మయ్య హాలియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు సంఘటనా స్థలానికి చేరి జరిగిన తీరును పరిశీలించి 302, 376 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
కాగా, గత కొంత కాలంగా గ్రామంలో తాగి జులాయిగా తిరుగుతున్న సత్రశాల శంకర్ పరారీలో ఉండడాన్ని గమనించి అతడే ఈ ఆఘాయత్యానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మిర్యాలగూడ డీఎస్‌పీ వెంకటేశ్వర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో పట్టుకుంటామన్నారు. ఆయన వెంట సీఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
*చిత్రం... మారేపల్లిలో అత్యాచారం, హత్యకు గురైన వృద్ధురాలి మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌పీ వెంకటేశ్వర్‌రావు